పురస్కారాలు
ప్రతి సంవత్సరం నాలుగు పాఠశాలల్లో అందజేసే భువనేశ్వరి దేవి విద్యా ప్రతిభా పురస్కారం.
2026
అక్టోబర్ 5, 2026
మొదటి సంవత్సరం. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నాడు, ఆమె ఉపాధ్యాయినిగా పనిచేసిన నాలుగు పాఠశాలల్లో — ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రతి తరగతి ప్రథమ విద్యార్థికి, మొత్తం ఇరవై మందికి.
పొగిరి · రాజాం · బొండపల్లి · జి. సిగడాం
2027 పురస్కారాలు
2027 సెప్టెంబర్ 5 · ఉపాధ్యాయ దినోత్సవం
ఇవే నాలుగు పాఠశాలల్లో, ప్రతి తరగతి ప్రథమ విద్యార్థికి. ఒక్క పరీక్ష ఆధారంగా కాకుండా, గత విద్యా సంవత్సరం మొత్తం ఫలితాల ఆధారంగా ఎంపిక చేస్తాము; ఆ సంవత్సరంలో క్రమశిక్షణను కూడా పరిగణనలోకి తీసుకుంటాము.
2027 సెప్టెంబర్ 5 నాటికి పదవ తరగతిలో ఉన్న విద్యార్థికి, తొమ్మిదవ తరగతిలో వారు సంవత్సరమంతా సాధించిన ఫలితాల ఆధారంగా ఈ పురస్కారం అందుతుంది.