ఉపాధ్యాయ జీవితం
ఆమె జీవితమంతా ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ బోధించారు. 2019లో గ్రేడ్-I హిందీ పండిట్‌గా పదవీ విరమణ చేశారు.
ఆమె సేవలందించిన పాఠశాలల్లో ఒక తరం విద్యార్థులకు ఆమె “భువనేశ్వరి టీచర్”.
ఉపాధ్యాయ దినోత్సవ సంప్రదాయం
ఆమె తండ్రి శ్రీ యెల్లుమహంతి నరసింహ మూర్తి పాత్రో గారు రాజాంలో ఉపాధ్యాయులు.
తమ ఉపాధ్యాయ జీవితంలో శ్రీమతి యెల్లుమహంతి భువనేశ్వరి దేవి గారు ఆయన స్మృతిలో ఉపాధ్యాయ దినోత్సవం నాడు తరగతి ప్రథమ విద్యార్థులను సత్కరించేవారు. ఆ విద్యా సంప్రదాయాన్ని ఇప్పుడు ఆమె కుటుంబం ఆమె స్మృతిలో కొనసాగిస్తోంది.
ఆమె సేవలందించిన పాఠశాలలు
పోగిరి ఉన్నత పాఠశాల
పోగిరి
ఆమె మొదటి పాఠశాల, చివరి పాఠశాల కూడా. తన తండ్రి స్మృతిలో ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రతి తరగతి ప్రథమ విద్యార్థిని సత్కరించినదీ ఇక్కడే.
ఆమె పదవీ విరమణ, 2019
ఆ కార్యక్రమం రికార్డు చేయబడింది. సహచరులు, విద్యార్థులు, బంధువులు ఆమె సమక్షంలోనే ఆమె ఉపాధ్యాయ ప్రస్థానం గురించి వివరంగా మాట్లాడారు.